నాన్నే సూపర్ హీరో | 'S/O Satyamurthy' an ode to fathers: Trivikram | Sakshi
Sakshi News home page

నాన్నే సూపర్ హీరో

Apr 8 2015 1:46 PM | Updated on Sep 3 2017 12:02 AM

నాన్నే సూపర్ హీరో

నాన్నే సూపర్ హీరో

యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు.

చెన్నై : యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు. ఇటీవల వస్తున్న చాలా చిత్రాలలో కుటుంబ సభ్యులతో తల్లికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారన్నారు. కానీ కుటుంబ సభ్యులతో తండ్రికి గల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు లేవన్నారు. కుటుంబంలో తండ్రి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు.

తండ్రీ కొడుకుల మధ్య అనుంబంధాన్ని... తండ్రిని పూజించమని చెప్పే చక్కని కథాంశంతో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని తెరకెక్కించినట్లు త్రివిక్రమ్ తెలిపారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్, సమంత, నిత్యమీనన్, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. వారిద్దరి కాంబినేషన్లో జులాయి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement