స్క్రీన్‌ టెస్ట్‌

Rajinikanth 2 movies to release in 2018 - Sakshi

► ఈ సంవత్సరం (2018) విడుదలవ్వటానికి సిద్ధంగా ఉన్న ‘రజనీకాంత్‌’ సినిమాలెన్నో తెలుసా?
ఎ) ఒకటి బి) రెండు సి) మూడు డి) నాలుగు

► ‘భరత్‌ అనే నేను’, ‘రంగస్థలం–1985’... ఈ రెండు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒక్కరే? ఎవరై ఉంటారో కనుక్కోండి చూద్దాం?
ఎ) అనిరుద్‌  బి) యస్‌.యస్‌. తమన్‌  సి) గోపీసుందర్‌ డి) దేవిశ్రీ ప్రసాద్‌

► 2018 జనవరిలో ‘భాగమతి’ అనే సినిమా రిలీజు కానుంది. ఈ చిత్రంలో ‘ అనుష్క’ హీరోయిన్‌గా నటించింది? ఏ నిర్మాణ సంస్థ నిర్మించిందో తెలుసా? (ఎ)
ఎ) యువీ క్రియేషన్స్‌  బి) గీతా ఆర్ట్స్‌ సి) వైజయంతి మూవీస్‌  డి) 14 రీల్స్‌

► ఈ ‘సంక్రాంతి’కి వస్తున్న సినిమాలలో రెండు పెద్ద సినిమాలలో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) అనూ ఇమ్మాన్యుయేల్‌  బి) రాయ్‌ లక్ష్మీ   సి) కీర్తీ సురేశ్‌  డి) అనుపమాపరమేశ్వరన్‌

► ‘స్కెచ్‌’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో హీరో విక్రమ్‌.  హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) సమంత  బి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌  సి) రెజీనా  డి) తమన్నా

► ఆయనొక రైటర్‌. 2017లో మెగా ఫోన్‌ పట్టాడు. 2018లో దర్శకుడిగా తన మొదటి సినిమా రిలీజవుతుంది? ఎవరా రచయిత–దర్శకుడు?
ఎ) విజయేంద్ర ప్రసాద్‌  బి) శివా నిర్వాణ  సి) వక్కంతం వంశీ డి) ఐవీ ఆనంద్‌

► 2018లో సాయిపల్లవి నటించే మొదటి సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి ?
ఎ) శర్వానంద్‌  బి) నాని    సి) కల్యాణ్‌రామ్‌ డి) వరుణ్‌తేజ్‌

► మంచు విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఈ నెలలో రిలీజవుతోంది. ఆయన ప్రక్కన ఫుల్‌ లెంగ్త్‌ పాత్ర చేసిన హాస్య నటుడెవరో తెలుసా?
ఎ) పృథ్వీ  బి) పోసాని కృష్ణమురళి   సి) సప్తగిరి  డి) బ్రహ్మానందం

► ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభించనున్న బోయపాటి. శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించనున్న హీరో ఎవరు?
ఎ) బాలకృష్ణ  బి) మహేశ్‌బాబు  సి) రామ్‌చరణ్‌  డి) యన్టీఆర్‌

► చాలా కాలం గ్యాప్‌ తర్వాత ఈ సంవత్సరం ‘దిల్‌’ రాజుతో కలిసి ఓ అగ్రనిర్మాత ఓ సినిమా నిర్మించనున్నారు. ఎవరా నిర్మాత? చిన్న క్లూ (ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తారు.
ఎ) బీవియస్‌యన్‌ ప్రసాద్‌  బి) చలసాని అశ్వనీదత్‌  సి) సురేశ్‌బాబు  డి) కేయస్‌ రామారావు

► పాటల  రచయిత కృష్ణ చైతన్య రెండోసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరో ఎవరు?
ఎ) అల్లు శిరీష్‌  బి) నితిన్‌  సి) మంచు మనోజ్‌  డి) అఖిల్‌

► ఈ క్రింద ఉన్న నాలుగు సినిమాలలో ఫిబ్రవరి 9న విడుదల కాని చిత్రం ఏంటో తెలుసా?
ఎ) కిరాక్‌ పార్టీ   బి) గాయత్రి   సి) తొలిప్రేమ  డి) ఛలో

► 2018లో రాబోతున్న పూరి జగన్నాథ్‌ సినిమా పేరు ‘మెహబుబా’. అందులో హీరో ఎవరు? సి)
ఎ)సుమంత్‌ అశ్విన్‌   బి) శ్రీ విష్ణు   సి) ఆకాష్‌ పూరి   డి) అడవి శేష్‌

► రవితేజ కొత్త సినిమా ‘టచ్‌ చేసి చూడు’లో హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రకుల్‌ ప్రీత్‌సింగ్‌   బి) రాశీ ఖన్నా  సి) శ్రుతీహాసన్‌  డి) మెహరీన్‌

► 2018 ప్రథమార్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్న యంగ్‌ హీరో ఎవరు ?
ఎ) నాగచైతన్య   బి) రామ్‌    సి ) నాని  డి) నిఖిల్‌

► చిరంజీవి చేస్తున్న ‘సైరా’ నరసింహా రెడ్డి సినిమాలో నరసింహా రెడ్డికి ఎంత మంది భార్యలు?
 ఎ)ముగ్గురు బి) ఇద్దరు   సి) ఒక్కరు  డి) నలుగురు

► ఈ సంవత్సరం బాలీవుడ్‌ మూవీని డైరెక్ట్‌ చేస్తున్న టాలీవుడ్‌ దర్శకుడు ఎవరు?
ఎ) పూరీ జగన్నాద్‌   బి) వీవీ వినాయక్‌   సి) కృష్ణవంశీ  డి) క్రిష్‌

► విశాల్‌  హీరోగా నటిస్తున్న ‘అభిమన్యుడు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న టాప్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) నయనతార బి) కాజల్‌   సి) తమన్నా  డి) సమంత

► నాగార్జున–రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా వీరి కాంబినేషన్‌లో ఎన్నో చిత్రం?
ఎ) 2 బి) 5 సి) 4 డి) 6

► 2017లో ‘ఘాజీ’ సినిమా ద్వారా సంచలనం సృష్టించిన  దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తదుపరి సినిమాలో హీరో ఎవరు?
ఎ) రాజ్‌ తరుణ్‌  బి) నాగ శౌర్య  సి) వరుణ్‌ తేజ్‌  డి) విజయ్‌ దేవరకొండ

సమాధానాలు
1.బి, 2.డి, 3.ఎ, 4.సి, 5.డి,6.సి, 7.ఎ, 8.డి, 9.సి, 10.బి,11.బి, 12.డి, 13.సి, 14.బి,15.ఎ, 16.ఎ, 17.డి, 18.డి, 19.సి, 20.సి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top