చోరీ చేశారా? లేదా? | Rajendra Prasad Turns Cook On Sets | Sakshi
Sakshi News home page

చోరీ చేశారా? లేదా?

Nov 11 2017 12:30 AM | Updated on Nov 11 2017 12:30 AM

Rajendra Prasad Turns Cook On Sets - Sakshi

గళ్ల లుంగీ... మెడలో టవల్‌... చేతిలో ఇనుప గరిటె... కాళ్లకి సాదాసీదా చెప్పులు... రాజేంద్రప్రసాద్‌ అసలు సిసలైన వంటోడిలా ఉన్నారు. ఉండడం కాదు... నిజమే! ఈ ఫొటో తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ సెట్‌లో జనాలకి వంట చేస్తున్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌ గారు సెట్‌లో ఉంటే నవ్వులకు మాత్రమే కాదు, ఫుడ్‌కీ లోటుండదు. ఆయన వండుతుంటే... చోరీ ఎలా చేయాలా? అని రాజ్‌తరుణ్‌ ఎదురు చూస్తున్నాడు’’ అని నిర్మాత అనిల్‌ సుంకర ట్వీట్‌ చేశారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రధారిగా అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ‘రాజుగాడు’ సెట్‌లో చోటు చేసుకుందీ సీన్‌! ‘ఈడో రకం ఆడో రకం, అంధగాడు’ సిన్మాల తర్వాత వీళ్ల ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఎన్ని ప్లానులు వేసినా... చివరికి, చోరీ చేయలేకపోయారు. ఎందుకంటే... చోరీ చేయాలని ప్రయత్నించేలోపే వడ్డించేశారు.  ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం వెరీ హ్యాపీ. ఆయన వండిన ఫుడ్‌ చాలా టేస్టీగా ఉంది’’ అన్నారు రాజ్‌ తరుణ్‌.

Advertisement
 
Advertisement
Advertisement