రాజకీయాల్లోకి లాగకండి ప్లీజ్‌: దర్శకుడు | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి లాగకండి ప్లీజ్‌: దర్శకుడు

Published Tue, Sep 12 2017 7:53 PM

రాజకీయాల్లోకి లాగకండి ప్లీజ్‌: దర్శకుడు - Sakshi

తమిళనాడు: నన్ను రాజకీయాల్లోకి లాగకండని ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్‌ అంటున్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకట విడుదల చేశారు. అందులో తానెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని దయచేసి నన్ను వాటిలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ముని - 4 చిత్ర పూజ కోసం సోమవారం తిరుపతికి వెళ్లొచ్చానని చెప్పారు. దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా  మీడియా మిత్రులు తన సినిమా వివరాలు అడిగారని అన్నారు. అదే విధంగా తన తల్లికి కట్టించిన గుడి వివరాలు అడిగారని చెప్పారు.

నీట్‌ వ్యవహారం గురించి అడిగితే దానికి కాలమే బదులిస్తుందని చెప్పానని, అయితే బీజేపీ పార్టీకి కాలమే బదులిస్తుందని మీడియాలో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు సేవ, ఆధ్యాత్మికం అంటేనే ఇష్టమని, రాజకీయాలంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. అంతేకాని తన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యార్థిని అనిత కుటుంబానికి రూ. 15 లక్షలు సాయం చేశారా? అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు, ఆ భగవంతునికి, అనిత కుటుంబానికి తెలిస్తే చాలని బదులిచ్చానని రాఘవలారెన్స్‌ పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement