ఫైట్స్ చేశా | Nikesha Patel Fighting scenes Rum movie | Sakshi
Sakshi News home page

ఫైట్స్ చేశా

Apr 28 2014 12:13 AM | Updated on Sep 2 2017 6:36 AM

ఫైట్స్ చేశా

ఫైట్స్ చేశా

నేను ఫైట్స్ చేశానంటున్నారు నటి నికీషా పటేల్. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరితో ఎందుకు ఫైట్స్ చేశారన్నదేగా మీ సందేహం. ‘‘ఎవరితోనో ఎందుకు ఫైట్స్ చేస్తాను,

 నేను ఫైట్స్ చేశానంటున్నారు నటి నికీషా పటేల్. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరితో ఎందుకు ఫైట్స్ చేశారన్నదేగా మీ సందేహం. ‘‘ఎవరితోనో ఎందుకు ఫైట్స్ చేస్తాను, అంతా సినిమా కోసమే’’ నంటున్నదీ ఉత్తరాది భామ. సినిమాలో పోరాట దృశ్యాల్లో నటించానంటున్న నికీషా ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఆమె ఒక నాయకిగా నటించిన ఎన్నమో ఏదో చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ అమ్మడి చేతిలో మరో మూడు, నాలుగు తమిళ చిత్రాలున్నాయట. వాటిలో ఒకటి రంభ ఊర్వశి మేనక (రమ్). ఈ చిత్రం గురించి నికీషా తెలుపుతూ రంభ ఊర్వశి మేనక చిత్రంలో నటి త్రిష, ఇషా చావ్లాతో కలిసి నటిస్తున్నానని చెప్పారు.
 
 ఇది మిస్టరీ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో తాను ఫైటింగ్ సన్నివేశాల్లోనూ నటించానని పేర్కొన్నారు. స్టంట్ మాస్టర్ విజయన్ కాంబినేషన్‌లో తాను నటిస్తున్న రెండో చిత్రం రంభ ఊర్వశి మేనక అని చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలు, అలరిస్తాయన్నారు. దీంతోపాటు నారదన్ అనే మరో చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నకుల్‌కు జంటగా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మెమొరీలాస్ అయిన యువతి పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు వారు ఫాంటసీ కథా చిత్రంలో నటించనున్నట్లు నికీషా వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement