రెడ్డిగారి అల్లుడికి క్లాప్‌! | Naga Chaitanya's next with director Maruthi to be launched | Sakshi
Sakshi News home page

రెడ్డిగారి అల్లుడికి క్లాప్‌!

Nov 26 2017 12:35 AM | Updated on Sep 27 2018 8:49 PM

Naga Chaitanya's next with director Maruthi to be launched - Sakshi - Sakshi

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మించనుందనీ, ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ పేరు పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. సిన్మా పేరు అదో? కాదో? తెలీదు గానీ... నిన్న కొబ్బరికాయ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా తెరకెక్కనున్న చైతూ–మారుతిల సినిమా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఇందులో చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్‌ నాయికగా నటించనున్నారు. పూజా కార్యక్రమాల తర్వాత హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. ‘‘జనవరి 5న చిత్రీకరణ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు మారుతి. సితార మాతృ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌. రాధాకృష్ణ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement