హృదయాన్ని హత్తుకునేలా... | Naa Nuvve to release on June 14 | Sakshi
Sakshi News home page

హృదయాన్ని హత్తుకునేలా...

May 27 2018 1:39 AM | Updated on May 27 2018 1:39 AM

Naa Nuvve to release on June 14 - Sakshi

కల్యాణ్‌ రామ్, తమన్నా

కల్యాణ్‌ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్‌లో చూపించే చిత్రం ‘నా నువ్వే’. ఇద్దరూ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’’ అన్నారు  చిత్ర నిర్మాతలు కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వటికూటి. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర రూపొందించిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’.

మహేశ్‌ కోనేరు సమర్పణలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ నిర్మాణంలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వటికూటి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యూ’ సర్టిఫికేట్‌ పొందింది. ఈ సినిమాను జూన్‌ 14న రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘జయేంద్రగారు అద్భుతమైన ఫీల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పీసీ శ్రీరామ్‌గారు ప్రతీ ఫ్రేమ్‌ను ఎక్స్‌ట్రాడినరీగా చూపించారు. శరత్‌ సంగీతానికి మంచి స్పందని లభిస్తోంది’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement