చిరు కొత్త లుక్ చూశారా..! | Mega star Chiranjeevi New Look | Sakshi
Sakshi News home page

Jan 13 2018 1:50 PM | Updated on Jan 13 2018 1:50 PM

Mega star Chiranjeevi New Look - Sakshi

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. రెండో షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లుక్ కోసం మెగాస్టార్ కొంత కాలంగా గెడ్డంతో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్ లో కూడా చిరు అదే లుక్ లో పాల్గొన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. శనివారం జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గెడ్డం, మీసం లేకుండా కనిపించారు.

న్యూ ఇయర్ వేడుకల సమయంలో గెడ్డం లేకుండా కనిపించిన చిరు తరువాత గ్రాఫిక్స్ వర్క్‌ కోసం మీసం కూడా తీసేశారట. రెండో షెడ్యూల్‌ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈ లోగా గ్రాఫిక్స్‌కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం చిరు ఈ న్యూ లుక్‌ లోకి మారిపోయారని తెలుస్తోంది. త్వరలో సైరా నరసింహారెడ్డి సినిమా రెండో షెడ్యూల్‌ పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement