యూరప్‌ టు పొల్లాచ్చి! | Sakshi
Sakshi News home page

యూరప్‌ టు పొల్లాచ్చి!

Published Sat, Nov 11 2017 12:49 AM

Mahesh Babu's bharath ane nenu movie pic leaked - Sakshi

ఇప్పుడు మహేశ్‌బాబు ఎక్కడున్నారు? యాడ్‌ షూటింగ్‌ కోసం యూరప్‌ వెళ్లారు. మరి.. సినిమా షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్‌ అవుతారు? అనే క్వొశ్చన్‌కు ఆన్సర్‌ కావాలంటే మేటర్‌ కంటిన్యూ చేయండి. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను... ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాలో మహేశ్‌బాబు సీయంగా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతిపక్ష నేతగా పోసాని నటిస్తుండగా, మహేశ్‌ సెక్రటరీగా బ్రహ్మాజీ యాక్ట్‌ చేస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఇటీవలే సీయం చాంబర్‌ సీన్స్‌ను కంప్లీట్‌ చేశారు. యూరప్‌ నుంచి మహేశ్‌ రిటర్న్‌ అయిన వెంటనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ పొల్లాచ్చిలో స్టార్ట్‌ కానుందట. అక్కడ కొన్ని ఫైట్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తారట. అన్నట్లు ఇంకోమాట..  ఈ సినిమాలో హోలీ ఫెస్టివల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సూపర్‌ ఫైట్‌ ఉంటుందట. ఈ ఫైట్‌ థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రనిర్మాత దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్‌ బయటికొచ్చింది. తాజాగా మరో స్టిల్‌ లీక్‌ అయింది. ఇక్కడ ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్నది ఆ ఫొటోనే.

Advertisement
Advertisement