ప్రేమలో పదనిసలు | L7 Movie Opening | Sakshi
Sakshi News home page

ప్రేమలో పదనిసలు

May 31 2015 11:48 PM | Updated on Sep 3 2017 3:01 AM

ప్రేమలో పదనిసలు

ప్రేమలో పదనిసలు

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మనం’ చిత్రాలకు రచనా సహాకారం అందించిన ముకుంద్ పాండే దర్శకత్వం

 ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మనం’ చిత్రాలకు రచనా సహాకారం అందించిన ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్-7’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ‘తుంగభద్ర’ ఫేమ్ అదిత్, పూజా ఝవేరి జంటగా బి. ఓబుల్ సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు దశరథ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమలోని పలు దశలను ఆవిష్కరిస్తూ సాగే ప్రేమ కథ ఇదని ముకుంద్ పాండే పేర్కొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: మోహన్‌రావు. బి-సతీష్ కొట్టే-కె. పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్ రెడ్డి.
 

Advertisement

పోల్

Advertisement