తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్‌? | Kangana Ranaut buys three-storey bungalow for herself on her birthday | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్‌?

Mar 25 2017 11:48 PM | Updated on Sep 5 2017 7:04 AM

తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్‌?

తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్‌?

ప్రస్తుతం కంగనా రనౌత్‌ గురించి రెండు వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకటి ఆమె క్రిష్‌ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేయనున్నారనే వార్త.

ప్రస్తుతం కంగనా రనౌత్‌ గురించి రెండు వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకటి ఆమె క్రిష్‌ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేయనున్నారనే వార్త. రాణి లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. ఈ సినిమా తర్వాత కంగనా డైరెక్షన్‌ చేయనున్నారన్నది మరో వార్త. ఈ రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో రానున్న రోజులు చెప్పేస్తాయ్‌.

ఇదిలా ఉంటే.. గత బుధవారం కంగనా  పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు తానే ఓ గిఫ్ట్‌ ఇచ్చుకున్నారు. ముంబైలోని ఓ ప్రముఖ ఏరియాలో మూడంతస్తుల బిల్డింగ్‌ కొన్నారట. దీన్ని పర్సనల్‌ ఆఫీస్‌లా మార్చాలనుకుంటున్నారని సమాచారం. బిల్డింగ్‌ని సౌకర్యవంతంగా మార్పించాక, తాను దర్శకత్వం వహించనున్న సినిమా కార్యక్రమాలను అక్కడ మొదలుపెట్టాలనుకుంటున్నారని బాలీవుడ్‌ భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement