సెప్టెంబర్ స్పెషల్ గురూ! | Kalyan Krishna Movie with Naga Chaitanya Archives | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ స్పెషల్ గురూ!

Sep 2 2016 11:39 PM | Updated on Sep 4 2017 12:01 PM

సెప్టెంబర్ స్పెషల్ గురూ!

సెప్టెంబర్ స్పెషల్ గురూ!

అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెర పడింది. ‘మనం’తో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులకు మధురమైన చిత్రం

అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెర పడింది. ‘మనం’తో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులకు మధురమైన చిత్రం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిసింద్రీ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో అక్కినేని నాగార్జునకి సూపర్ హిట్ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు.
 
  త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘సెప్టెంబర్ రాక్స్ ఫర్ మి. నా స్టార్ డెరైక్టర్స్ కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య, విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమాలు చేయబోతున్నారు. త్వరలో ఇవి సెట్స్‌కి వెళతాయి’’ అని నాగ్ పేర్కొన్నారు. కొత్త కథలను ఎంపిక చేయడంలోనూ, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ నాగార్జున ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు.
 
 కొత్తకు పట్టం కడుతూ ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలు ఆ కోవలోనివే. ఈ రెండిటితో పాటు ‘ఊపిరి’తో వరుస విజయాలు సాధించిన నాగార్జున జోరుగా ‘నమో వెంకటేశాయ’లో నటిస్తున్నారు. అదే జోరు మీద కుమారుల కోసం సినిమాలు సెట్ చేసే పనిలో పడ్డారాయన.
 

Advertisement
 
Advertisement
Advertisement