మూఢ నమ్మకాల నేపథ్యంలో... | horror movie Background | Sakshi
Sakshi News home page

మూఢ నమ్మకాల నేపథ్యంలో...

Feb 15 2017 11:45 PM | Updated on Sep 5 2017 3:48 AM

మూఢ నమ్మకాల నేపథ్యంలో...

మూఢ నమ్మకాల నేపథ్యంలో...

‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ

‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ క్రియేషన్స్‌ పతాకంపై చల్లా విజయ్‌కుమార్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సిరాజ్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకురాలు మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నాకిది మూడవ చిత్రం. కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని కథ సిద్ధం చేశా. ఇందులో బాలిక పాత్ర హైలెట్‌. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టి,  సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కథ వినగానే ఎగై్జట్‌ అయ్యా. సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేశా’’ అన్నారు నిర్మాత విజయ్‌ కుమార్‌. తనికెళ్ల భరణి, జయసుధ, ఉత్తేజ్, జీవా, దువ్వాసి మోహన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందర్‌ కృష్ణ, సంగీతం: శ్రీ కోటి.

Advertisement
 
Advertisement
Advertisement