నా తాజా అందాలు ఇవిగో : హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

పెళ్లి సందడిలో హన్సిక

Published Fri, Dec 1 2017 5:11 PM

Heroine Hansika slim photos Halchal in social media - Sakshi

పెళ్లి సందడిలో ముంబాయి బ్యూటీ హన్సిక తెగ సంబరపడి పోయ్యింది. పెళ్లి తనది కాదండోయ్‌.. ఆమె సోదరుడు ప్రశాంత్‌ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. అయితే అదేదో తన పెళ్లే అన్నంతగా హీరోయిన్‌ హన్సిక ఆనందంతో ఖుషీ అయ్యింది. మెహంది వేడుక నుంచి పెళ్లి వరకూ సోదరుడి పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఆటా పాటా అంటూ హన్సిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెళ్లి వేడుక ఫోటోలను ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఆనందాన్ని పంచుకుంది. 

అయితే హన్సిక ఆడి పాడి ఎంజాయ్‌ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ప్రస్తుతం గులేభకావళీ చిత్రంలో ప్రభుదేవాతో రొమాన్స్‌ చేస్తుంది. కానీ బొద్దుగా ముద్దుగా ఉండే హన్సిక ఇటీవల బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారయ్యింది. ఆ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టు చేసి తన తాజా అందాలివిగో అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమ, పెళ్లి వరకూ వచ్చి బెడిసి కొట్టిన విషయం తెలిసిందే.



Advertisement

తప్పక చదవండి

Advertisement