సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట! | DNA originally attributed the report to Bollywood Life.com. Are you ready for the heart break alert, | Sakshi
Sakshi News home page

సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!

May 13 2016 4:25 PM | Updated on Sep 4 2017 12:02 AM

సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!

సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!

తన పెళ్లిగోల మీద ఇంతవరకు పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు ఒక ప్రకటన చేయనున్నాడట

ముంబై:   తన పెళ్లిగోల మీద ఇంతవరకు పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్  ఖాన్ ఎట్టకేలకు ఒక ప్రకటన చేయనున్నాడట.  తన విదేశీప్రియురాలు, రష్యా మోడల్ లులియా వంతూర్  ప్రేమకథ స్టోరీలకు త్వరలోనే  శుభం కార్డు వేయనున్నాడట ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.  తమ  బాంధవ్యాన్ని అధికారికంగా ప్రకటించి,  లులియాను అందరికీ పరిచయం చేయనున్నట్టు సమాచారం. అదీ బాలీవుడ్ సుందరి వెడ్డింగ్ రిపెప్షన్ లో. 

డీఎన్ఎ కథనం ప్రకారం సొట్టబుగ్గల  సుందరి ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ లో సల్మాన్ ఖాన్  అఫీషియల్ గా  అనౌన్స్ చేయనున్నాడని తెలుస్తోంది.  సల్మాన్ అధికారికంగా లులియాను  సినీ పరిశ్రమకు,  స్నేహితులకు పరిచయం చేయనున్నట్టు సమాచారం.  ఈ మధ్య లులియా సల్మాన్ , ఆయన కుటుంబ సభ్యులతో ముంబై  ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం విశేషంగా మారింది. ఈ ఏడాది చివరలో ఆమెను  సల్మాన్ పెళ్లి  చేసుకోవడం ఖాయమనే వార్త  బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా  ఇటీవలే దంపతులుగామారిన   ప్రీతి ,  జీన్ గుడెనఫ్    బి- టౌన్  పెద్దలు, స్నేహితులకు  ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే  ఇండియాకు చేరుకున్న ఈ జంట  ఢిల్లీలోని ప్రేమ మందిరం తాజ్ మహల్ దగ్గర సందడి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement