నాజర్‌కిది భిన్నమైన అనుభవం | different experience to Nassar | Sakshi
Sakshi News home page

నాజర్‌కిది భిన్నమైన అనుభవం

Aug 1 2015 12:33 AM | Updated on Sep 3 2017 6:31 AM

నాజర్‌కిది భిన్నమైన అనుభవం

నాజర్‌కిది భిన్నమైన అనుభవం

ప్రేక్షకులను సరికొత్త లోకంలో విహరించేలా తెరకె క్కిన చిత్రం ‘కదిలే బొమ్మల కథ’.

 ప్రేక్షకులను సరికొత్త లోకంలో విహరించేలా  తెరకె క్కిన చిత్రం ‘కదిలే బొమ్మల కథ’. సీనియర్ నటుడు నాజర్ ముఖ్యపాత్రలో తె లుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని శశిధర్ బోయినపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
 
 ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల కంటే  భిన్నమైన అనుభూతినిచ్చిన చిత్రమిదని నాజర్ పేర్కొన్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని దర్శక,నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రావుల నరేశ్, ఛాయాగ్రహణం: తిరుమల రావు.
 

Advertisement
 
Advertisement
Advertisement