లాభం తెచ్చే ధనలక్ష్మి | Dhanalakshmi Talupu Tadite teaser launched | Sakshi
Sakshi News home page

లాభం తెచ్చే ధనలక్ష్మి

May 2 2015 11:08 PM | Updated on Sep 3 2017 1:18 AM

లాభం తెచ్చే ధనలక్ష్మి

లాభం తెచ్చే ధనలక్ష్మి

కొన్ని పరిస్థితుల కారణంగా అనుకోకుండా ఈ చిత్రానికి భాగస్వామి అయ్యా. మనోజ్ నందం,

 ‘‘కొన్ని పరిస్థితుల కారణంగా అనుకోకుండా ఈ చిత్రానికి భాగస్వామి అయ్యా. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ నా మీద ఉన్న అభిమానంతో పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇతరులు నామమాత్రం పారితోషికం తీసుకుని ఈ సినిమా చేశారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నటుడు ధనరాజ్ అన్నారు. మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో ధనరాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ తదితరులు ముఖ్య తారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మీ తలుపు తడితే’.

 సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలో శావలి పాటలు స్వరపరిచారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను నిర్మాత కె.ఎల్. దామోదర్, దర్శకురాలు నందిని విడుదల చేశారు. మొదట్లో సంకోచించినా, ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందని రామసత్యనారాయణ అన్నారు. ఈ ధనలక్ష్మీ లాభం తెచ్చే సినిమా అవుతుందని అతిథులు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement