చిరు కోసం వినాయక్ రీసెర్చ్ | chiranjeevi vinayak katthilantodu details | Sakshi
Sakshi News home page

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

Jun 22 2016 12:11 PM | Updated on Sep 4 2017 3:08 AM

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

ఇంత వరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబందించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది.

ఇంతవరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement