సమ్మర్‌కే ‘సైరా’!

Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie Release Date - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు ఫ్యాన్స్‌ అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది.

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో సైరా రిలీజ్ వాయిదా పడటం కన్ఫామ్‌ అయిపోయింది. చరణ్‌, చిరు ఒకేసారి బరిలో దిగే పరిస్థితి ఉండదు కాబట్టి సైరాను కాస్త ఆలస్యంగా 2019 సమ్మర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్టైలిష్‌ చిత్రాల దర్శకుడు సురేందర్‌ రెడ్డి తొలిసారిగా ఓ చారిత్రక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌, కన్నడ స్టార్ హీరో సుధీప్‌, తమిళ హీరో విజయ్‌ సేతుపతి, స్టార్ హీరోయిన్‌ తమన్నాలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top