ఘనంగా చిరంజీవి సర్జా, మేఘన నిశ్చితార్థం | Chiranjeevi Sarja and Meghana Raj get engaged | Sakshi
Sakshi News home page

ఘనంగా చిరంజీవి సర్జా, మేఘన నిశ్చితార్థం

Oct 23 2017 9:06 AM | Updated on Jul 25 2018 3:13 PM

Chiranjeevi Sarja and Meghana Raj  get engaged - Sakshi

శాండిల్‌వుడ్కు చెందిన మరో జంట పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. వెండితెరపై హీరో హీరోయిన్లుగా రొమాన్స్‌ పండించిన జంటలు నిజ జీవితంలోనూ సంసార బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. ఈ ట్రెండ్‌ ఇటీవలి కాలంలో బాగా పెరగడం విశేషం.

సాక్షి, బెంగళూరు : కన్నడ నటుడు చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ల నిశ్చితార్థం ఆదివారం బెంగళూరు జేపీనగరలో ఉన్న మేఘనారాజ్‌ నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. నటుడు, దర్శకుడు అయిన అర్జున్‌సర్జాతో పాటు ఆయన  కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి సర్జా కాబోయే వధువు మేఘనారాజ్‌ ఇంటికి వచ్చారు. అర్జున్‌సర్జా భార్య ఆశారాణి, పిల్లలు ఐశ్వర్య సర్జా, ధృవసర్జాతో పాటు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు.

చిరంజీవి సర్జా కుటుంబ సభ్యులకు మేఘనా ఇంట్లోకి పూలహారం వేసి స్వాగతం పలికారు. హిందూ సంప్రదాయంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు. మేఘనారాజ్‌ ఎరువు రంగు చీరలో, చిరు సర్జా వైట్‌ షర్ట్, వైట్‌ పంచలో కనిపించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు బెంగళూరు నగరంలో ఉన్నలీలా ప్యాలెస్‌లో బంధువులు, సన్నిహితులతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో గులాబీ రంగులో గౌనులో మేఘనా, నీలం రంగు లైట్‌ చెక్స్‌ ఉన్న షర్ట్‌లో చిరు దర్శనమిచ్చారు.

ఉభయులూ నట ప్రముఖులే
సీనియర్‌ సినీనటులైన సుందర్‌రాజ్, ప్రమీలా జోషాయ్‌ దంపతుల కుమార్తె అయిన మేఘనారాజ్‌.. పుండ అనే కన్నడ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. మలయాళం సినిమాల్లో మంచి పేరును తెచ్చుకోవడం జరిగింది, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా సినిమాల్లో  నటించారు. కన్నడలో రాకింగ్‌ స్టార్‌ యశ్‌తో నటించిన రాజాహులి సినిమా ద్వారా మేఘనారాజ్‌కు మంచి పేరు సంపాదించారు.

బహుపరాక్, లక్ష్మణ, అల్లమ యశస్వీ తదితర సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆటగార సినిమాలో మేఘనారాజ్, చిరంజీవి సర్జా ఇద్దరు జంటగా నటించడం విశేషం. ప్రముఖ నటుడు అర్జున్‌సర్జా సోదరి కుమారుడే చిరంజీవి సర్జా. వాయుపుత్ర సినిమా ద్వారా కన్నడ సినిమాల్లోకి అడుగు పెట్టిన చిరు సర్జా, అనంతరం గండెదె, చిరు, దండం దశగుణం, వదర నాయక, రుద్రతాండవ తదితర పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. 

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement