బోనీకపూర్ భార్యల పెద్ద కోరిక నెరవేరలేదు! | Boney Kapoor Wives Mona and Sridevis big wish not comes true | Sakshi
Sakshi News home page

బోనీకపూర్ భార్యల పెద్ద కోరిక నెరవేరలేదు!

Feb 26 2018 2:41 PM | Updated on Feb 26 2018 2:59 PM

Boney Kapoor Wives Mona and Sridevis big wish not comes true - Sakshi

మోనా షౌరీ కపూర్, బోనీకపూర్, శ్రీదేవి

సాక్షి, సినిమా: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన‍్మరణం పలు సినిమా ఇండస్ట్రీలలో విషాదం నింపింది. ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబైకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు బాలీవుడు ప్రముఖులు బోనీకపూర్ సోదరుడు అనిల్ కపూర్ నివాసానికి చేరుకుంటున్నారు. కాగా, బోనీకపూర్ తొలి భార్య మోనా షౌరీ కపూర్‌ లాగే రెండో భార్య శ్రీదేవి సైతం ఓ పెద్ద కోరికను తీర్చుకోకుండానే కన్నుమూశారని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.

అప్పుడు మోనా కపూర్..
గతంలో బోనీకపూర్ మొదటి భార్య మోనా షౌరీ కపూర్ తమ కుమారుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఫస్ట్ సినిమా రిలీజ్‌కి కొన్ని నెలలముందు మరణించారు. 13 ఏళ్ల వివాహబంధం తర్వాత 1996లో భర్త బోనీ నుంచి మోనా కపూర్ విడాకులు తీసుకున్నారు. మోనా కపూర్, బోనీల కుమారుడు అర్జున్ కపూర్ నటించిన తొలిచిత్రం ఇషక్ జాదే. 2012 మేలో కుమారుడి తొలి మూవీ విడుదల కావల్సి ఉండగా.. అదే ఏడాది మార్చి 25న మోనా కపూర్ మృతిచెందారు. దీంతో హీరోగా కుమారుడి సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలన్న మోనా కోరిక తీరలేదు.

ఇప్పుడు శ్రీదేవి..
మోనాతో విడాకులు తీసుకున్న ఏడాదే నిర్మాత బోనీకపూర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. కాగా, శ్రీదేవికి తన పెద్ద కుమార్తె జాన్వీకపూర్‌ ను వెండితెర మీద చూసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ కూతురు జాన్వీ నటించిన ఫస్ట్ సినిమా దడక్ రిలీజ్‌కు కొన్ని నెలల ముందు శ్రీదేవి ఆకస్మికంగా మృతిచెందారు. జాన్వీ తొలి మూవీ ఈ ఏడాది జూలై 20న విడుదల కానుండగా..  ఫిబ్రవరి 24న నటి శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో బోనీ ఇద్దరు భార్యలు మోనా (మాజీ భార్య), శ్రీదేవిలు తమ వారసుల్ని తెరపై చూసుకోవాలనుకున్న పెద్ద కోరిక నెరవేరలేదు.

Advertisement
 
Advertisement
Advertisement