యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమకథ' | Anchor Ravi turns Hero | Sakshi
Sakshi News home page

యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమకథ'

Feb 25 2017 3:01 PM | Updated on Sep 5 2017 4:35 AM

యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమకథ'

యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమకథ'

యాంకర్గా బుల్లితెర మీద తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకున్న రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా

యాంకర్గా బుల్లితెర మీద తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకున్న రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై  అయోధ్య కార్తీక్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్తో ద్వారా యాంకర్ రవి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

ఈ సినిమాకు "ఇది మా ప్రేమ కథ" అనే టైటిల్తో పాటు '1>99' (1 ఈజ్ గ్రేటర్ దేన్ 99) అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  రవి సరసన ఇద్దరు అందాల భామలు నటించిన ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని రవి ఫస్ట్ లుక్ను ఓ ప్రముఖ సెలబ్రిటీ ఆన్ లైన్లో విడుదల చేస్తారని యూనిట్ సభ్యులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement