తెలుగులో ఇంకొకటి! | Amyra Dastur signed for second Telugu movie | Sakshi
Sakshi News home page

తెలుగులో ఇంకొకటి!

Jun 5 2017 1:03 AM | Updated on Sep 5 2017 12:49 PM

తెలుగులో ఇంకొకటి!

తెలుగులో ఇంకొకటి!

జాకీచాన్‌ హీరోగా నటించిన ఇండో–చైనీస్‌ సిన్మా ‘కుంగ్‌ ఫు యోగా’తో హిందీ హీరోయిన్‌ అమైరా దస్తూర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది.

జాకీచాన్‌ హీరోగా నటించిన ఇండో–చైనీస్‌ సిన్మా ‘కుంగ్‌ ఫు యోగా’తో హిందీ హీరోయిన్‌ అమైరా దస్తూర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. పాపులారిటీ పెరిగిన తర్వాత కొందరు రీజనల్‌ సినిమాలను చిన్న చూపు చూస్తారు. అమైరా అలా కాదు. ఓ పక్క హిందీలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూనే, మరో పక్క తెలుగు సినిమాలకు సంతకం చేస్తున్నారు.

మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న అమైరా, సుధీర్‌బాబు హీరోగా చేయనున్న కొత్త సినిమాకు సంతకం చేశారట! ‘దిక్కులు చూడకు రామయ్యా’ ఫేమ్‌ త్రికోటి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘శమంతక మణి’, ‘వీరభోగ వసంతరాయులు’ వంటి మల్టీస్టారర్స్‌ చేస్తున్న సుధీర్‌బాబు, ‘భలే మంచి రోజు’ తర్వాత సోలో హీరోగా నటించనున్న చిత్రమిది..

Advertisement
 
Advertisement
Advertisement