పిచ్చి ప్రేమ... | Amla Pagla Deewana -3 is playing Bobby Deol and Kajal Aggarwal Lovers. | Sakshi
Sakshi News home page

పిచ్చి ప్రేమ...

Jul 13 2017 12:16 AM | Updated on Oct 30 2018 5:58 PM

పిచ్చి ప్రేమ... - Sakshi

పిచ్చి ప్రేమ...

కాజల్‌ ప్రేమలో పడ్డారండి. అది కూడా అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. క్రేజీగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నారట.

కాజల్‌ ప్రేమలో పడ్డారండి. అది కూడా అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. క్రేజీగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నారట. ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో అనుకుంటున్నారా? హిందీ నటుడు బాబీ డియోల్‌. ఈ ఇద్దరికీ లవ్‌ కుదిరింది ఎక్కడో తెలుసా? ‘యామ్లా పగ్లా దీవానా’లో. ఈ టైటిల్‌ అర్థం క్రేజ్, మ్యాడ్‌ అని. ఈ సినిమాలోనే ఈ ఇద్దరూ లవర్స్‌గా నటిస్తున్నారు. అసలు విషయం అది.

ధర్మేంద్ర, బాబీ డియోల్, సన్నీ డియోల్‌ యాక్ట్‌ చేసిన ‘యామ్లా పగ్లా దీవానా’ చిత్రం 2011లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2013లో దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘యామ్లా పగ్లా దీవానా 2’ చిత్రం ఓ మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి.. బాబీ, కాజల్‌ నటించనున్న ‘యామ్లా పగ్లా దీవానా 3’ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. హిందీలో కాజల్‌కి పెద్దగా హిట్లు లేవు. ఆ కొరతను ఈ సినిమా తీర్చేస్తుందని బాలీవుడ్‌ వారు అంటున్నారు. స్క్రిప్ట్‌ అంత బాగుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement