హాస్పిటల్‌లో మాదాల | Actor Madala Ranga Rao admitted in hospital | Sakshi
Sakshi News home page

హాస్పిటల్‌లో మాదాల

May 21 2018 1:25 AM | Updated on May 21 2018 1:25 AM

విప్లవ నటుడు, నిర్మాత ‘రెడ్‌ స్టార్‌’ మాదాల రంగారావు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్‌ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్‌ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు.  డయాలసిస్‌ జరుగుతోంది.  ఆయన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement