అర్జున్‌ అండ్‌ అర్జున్‌! | action king arjun key role in allu arjun movie | Sakshi
Sakshi News home page

అర్జున్‌ అండ్‌ అర్జున్‌!

Apr 1 2017 12:31 AM | Updated on Sep 5 2017 7:35 AM

అర్జున్‌ అండ్‌ అర్జున్‌!

అర్జున్‌ అండ్‌ అర్జున్‌!

స్టైల్‌కి యాక్షన్‌ తోడైతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో త్వరలోనే మెగాఫోన్‌ పట్టనున్న రచయిత వక్కంతం వంశీ చూపిస్తారట!

స్టైల్‌కి యాక్షన్‌ తోడైతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో త్వరలోనే మెగాఫోన్‌ పట్టనున్న రచయిత వక్కంతం వంశీ చూపిస్తారట! అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. దేశభక్తి కథతో రూపొందే ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. తాజా ఖబర్‌ ఏంటంటే... ఇందులో కీలక పాత్రను ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌ చేయనున్నారట! ‘ఒకే ఒక్కడు’, ‘జెంటిల్‌మన్‌’, ‘జైహింద్‌’ వంటి దేశభక్తి సినిమాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు చేశారాయన.

ఇప్పుడీ దేశభక్తి సినిమాలో అర్జున్‌ చేయబోయే పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా, కథలో కీలకంగా ఉంటుందట. అర్జున్‌ అండ్‌ అర్జున్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ ప్రేక్షకులకు సూపర్‌ కిక్‌ ఇస్తాయట. ప్రస్తుతం బన్నీ ‘దువ్వాడ జగన్నాథమ్‌’ (డీజే) చేస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న డీజే పూర్తయిన తర్వాత జూన్‌లో వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement