ప్రేమజాతకం 28-02-20 నుంచి 05-03-20 వరకు

Weekly Love Horoscope In Telugu - Sakshi

మేషం: అనుకున్న వ్యక్తులకు ప్రేమసందేశాన్ని అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత సానుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్యదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

వృషభం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అనుకూలం. ఈ సమయంలో అవతలి వారి నుంచి కూడా ఊహించిన సమాచారం రావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించండి. ఇక, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు విరామం ఇవ్వండి.

మిథునం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వారి నుంచి అనుకూల సందేశాలు సైతం అందుకోవచ్చు. ప్రతిపాదనలు చేసే రోజుల్లో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

కర్కాటకం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ ప్రతిపాదనలు అందించేందుకు శని, గురువారాలు చాలా అనుకూలమైనవి. ఈరోజులలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు  ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది.

సింహం: మీరు అత్యంత ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, ప్రతిపాదనలు అందించేందుకు ఆది, బుధవారాలు చాలా అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు ఆమోధం పొందే అవకాశాలున్నాయి. అలాగే, ఇటువంటి సమయంలో మీరు రెడ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశ బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, శుక్ర, శనివారాలు దూరంగా ఉండండి.

కన్య: మీ మనస్సులోని భావాలను ఇష్టులకు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రయత్నాలకు అవతలి వారి నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

తుల: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమసందేశాలను శుక్ర, శనివారాలు అందించండి. అవతలి వారి నుంచి సైతం శుభసందేశాలు అందుతాయి. ఇటువంటి రోజుల్లో మీరు బ్లూ, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, సోమ, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టమైన వ్యక్తులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి విశేష స్పందనలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ప్రకటించడం మంచిది.

ధనుస్సు:  మీరు ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శుక్ర, శనివారాలు చాలా మంచివని చెప్పాలి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే,ఆది, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

మకరం: మీ ప్రేమసందేశాలు, ప్రతిపాదనలు ఇష్టులకు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వారు కూడా మీ సందేశాలకు స్పందించే వీలుంటుంది. ఈసమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు దుస్తులు «ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది.

కుంభం: మీ అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని ఉద్దేశాలను ప్రతిపాదనల రూపంలో అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు సైతం అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు బ్లూ, బిస్కెట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

మీనం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి మంచిది.

 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top