ప్రేమ జాతకం 10-01-20 నుంచి 16-01-20 వరకు

Weekly Love Horoscope In Telugu - Sakshi

మేషం : వీరు తమ ఇష్టమైన వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శుక్ర, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో  అందించే సందేశాలకు అవతలి వైపు నుంచి సానుకూల స్పందన రావచ్చు. అలాగే, ఈసమయాల్లో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే, ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

వృషభం : మీ మనస్సులోని భావాలను ఇష్టులకు అందించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు అందించే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి ఆమోదం లభించే వీలుంది. అలాగే, మీరు ఇటువంటి ప్రతిపాదనలు అందించే సమయంలో రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. ఇక ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శుక్ర, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు వృథా కావు. అవతలి వారు సానుకూలంగా స్పందించవచ్చు. ఈ సమయాల్లో మీరు గ్రీన్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే  ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండండి. 

కర్కాటకం : మీ అభిప్రాయాలను మీరు అభిమానించే వ్యక్తులకు తెలియజేసేందుకు సోమ, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావచ్చు. ఈ సమయాలలో మీరు రెడ్, బ్రౌన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు మౌనం వహించడం ఉత్తమం.

సింహం : మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు  శని, మంగళవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రయత్నాలకు అవతలి వైపు నుంచి అనుకూల సమాచారం రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా  బయలుదేరండి. ఇక ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

కన్య : మీరు అభిమానించే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూల రోజులు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి సానుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఈరోజుల్లో పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, సోమ, మంగళవారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

తుల : మీ మనస్సులోని అభిప్రాయాలను ఆది, సోమవారాలు ఇష్టులకు తెలియజేయండి. అవతలి వైపు నుంచి మీరు ఊహించిన సందేశాలు రావచ్చు. అలాగే, ఈ సమయాల్లో మీరు  ఎల్లో, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి. కాగా, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

వృశ్చికం : మీరు అభిమానించే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ పట్ల అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు బ్రౌన్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకం. అలాగే, ఇంటి నుంచి  దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, సోమవారాలు ఈ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు : మీ ఆభిప్రాయాలను ఇష్టమైన వ్యక్తులకు తెలిపేందుకు శని, బుధవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ  ప్రయత్నాలు ఫలించి అవతలి వారి వైపు నుంచి అనుకూల స్పందన రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభాలు సిద్ధిస్తాయి. అయితే ఆది, మంగళవారాలు  వీటికి దూరంగా ఉండడం మంచిది.

మకరం : మీ భావాలను మీరు అభిమానించే వ్యక్తులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించే వీలుంది. అలాగే, ఇటువంటి సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. కాగా, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ప్రకటించడం మంచిది.

కుంభం : మీరు అత్యంత అభిమానించే వ్యక్తులకు మీ సందేశాలు అందించేందుకు సోమ, బుధవారాలు విశేషమైన రోజులు. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తర ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే శుక్ర, ఆదివారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

మీనం : మీ మనస్సులోని భావాలను తెలియజేసేందుకు  సోమ, గురువారాలు అనుకూలమైనవి. ఈరోజులలో మీపై అవతలి వారు మరింత ప్రేమాభిమానాలు చూపే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక శుక్ర, ఆదివారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top