ప్రేమ జాతకం 20-12-19 నుంచి 26-12-19 వరకు

Weekly Love Horoscope In Telugu - Sakshi

మేషం : మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వ్యక్తులకు వెల్లడించేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈ రోజుల్లో మీపై ఆవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు పింక్, వైట్‌ రంగుల దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే మంగళ, బుధవారాలు ఇటువంటి ప్రయత్నాలను విరమించండి.

వృషభం : ఇంతకాలం మనస్సులోనే దాచుకున్న మీ అభిప్రాయాన్ని ఇష్టులకు తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో మీపట్ల ఆవతలి వారు కూడా సానుకూల వైఖరి ప్రదర్శించవచ్చు. మీరు రెడ్, బ్లూ రంగు దుస్తులు ధరించి ప్రతిపాదన చేయడం ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే ఫలితం కనిపిస్తుంది. ఇక శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

మిథునం : బుధ, గురువారాలు మీ కలలు ఫలించే సమయం. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలకు ఆవతలి వారి నుంచి కూడా అనుకూల సందేశాలు రావచ్చు. అలాగే, ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో ఎల్లో, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. మీ ప్రతిపాదనలు అందించేందుకు ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక ఇటువంటి వాటికి శుక్ర, శనివారాలు విరామం ఇవ్వండి.

కర్కాటకం : శని, బుధవారాలు ఇష్టులకు ప్రతిపాదనలు అందించేందుకు అనువైన రోజులు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు ఆవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు అందవచ్చు. ఇక ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, మీరు ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలురేరండి. అయితే ఆది, మంగళవారాలు మీ ప్రయత్నాలకు స్వస్తి చెప్పండి.

సింహం : మీ అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు ఆది, మంగళవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రేమ ప్రయత్నాలు ఫలించి ఆవతలి వారు కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, స్కైబ్లూ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక ఇటువంటి ప్రయత్నాలకు శని, బుధవారాలు దూరంగా ఉండండి.

కన్య : శుక్ర, సోమవారాలు మీకు కలసివచ్చే రోజులు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై ఆవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే వీలుంది. అలాగే, ఈ సమయంలో మీరు గ్రీన్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇటువంటి సమయంలో ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే బుధ, గురువారాలు ఇటువంటి  ప్రయత్నాలను విరమించండి.

తుల : శని, సోమవారాలు మీకు ఇష్టమైన వ్యక్తులకు మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు అనువైన కాలం. ఈ రోజుల్లో మీరు పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. మీ ప్రేమ ప్రతిపాదనలు చేసేందుకు మీరు ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే శుక్ర, బుధవారాలు ఇటువంటి ప్రతిపాదనలను మనస్సులోనే దాచుకోండి.

వృశ్చికం : మీ అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, బుధవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో ఆవతలి వారి నుంచి కూడా సానుకూల సందేశాలు అందే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. అలాగే, ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక మంగళ, గురువారాలు విరామం ఇవ్వడం మంచిది. 

ధనుస్సు : ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు అందించేందుకు శని, గురువారాలు అత్యంత అనువైనవి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలు ఆవతలి వారు ఆమోదించే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో మీరు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే మంగళ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

మకరం : మీకు అత్యంత ఇష్టమైన వారికి మీ మనస్సులోని భావాలను వెల్లడించేందుకు ఆది, మంగళవారాలు అనువైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలపై ఆవతలి నుంచి అనుకూల స్పందన రావచ్చు. అలాగే, ప్రపోజ్‌ చేసే సమయంలో మీరు ఆరెంజ్, బ్లూ రంగు దుస్తులు ధరించండి. ఇక ఇంటి నుంచి తూర్పు దిశగా బయలుదేరండి. అయితే శుక్ర, సోమవారాలు వ్యతిరేకమైనవి కావడం వల్ల మీ ప్రతిపాదలనలకు స్వస్తి చెప్పండి.

కుంభం : మీ అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై ఆవతలి వారు కూడా అనుకూలమైన సందేశాలు అందించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు వైట్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక  ఇంటి నుంచి ఉత్తరఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే శని, గురువారాలు మౌనం వహించడం మంచిది.

మీనం : ఇంతకాలం మీలోనే  దాచుకున్న ప్రేమసందేశాలను ఇష్టమైవ వారికి తెలిపేందుకు శుక్ర, బుధవారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలు ఆమోదం పొందే వీలుంది. ఈరోజుల్లో మీరు పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఇంటి నుంచి పశ్చిమం వైపు నుంచి బయలుదేరండి. అయితే ఇటువంటి ప్రయత్నాలు ఆది, సోమవారాలు ఫలించే అవకాశం లేనందున దూరంగా ఉండండి.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top