ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి! | Sakshi
Sakshi News home page

ప్రేమ జాతకం 24-01-20 నుంచి 30-01-20 వరకు

Published Fri, Jan 24 2020 3:05 PM

Weekly Love Horoscope From 24th To 30th January 2020 In Telugu - Sakshi

మేషం :  మీ అభిప్రాయాలను ఇష్టపడే వ్యక్తులకు తెలియజేసేందుకు శుక్ర, ఆదివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఇటువంటి సమయంలో గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, మంగళ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

వృషభం : మీ మనోగతాన్ని ఇష్టపడ్డ వ్యక్తులకు తెలిపేందుకు సోమ,బుధవారాలు సానుకూలమైనవి. ఈ సమయంలో మీ అభిప్రాయాలను అవతలి వారు గౌరవిస్తూ అనుకూల సందేశాలు పంపవచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. 

మిథునం :  మీ ప్రేమ ప్రతిపాదనలు ఇష్టమైన వ్యక్తులకు అందించేందుకు బుధ, గురువారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు అనుకూలమైన స్పందనలు వచ్చే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక శని, సోమవారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం:  మీ మనస్సులోని భావాలను అవతలి వారికి వెల్లడించేందుకు శుక్ర,శనివారాలు సానుకూలం. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారి నుంచి అనుకూల సమాచారం రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ దిశగా బయలుదేరితే శుభాలు సిద్ధిస్తాయి. అయితే, సోమ,బుధవారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది.

సింహం :   మీకు అత్యంత ఇష్టమైన వారికి ప్రేమసందేశాలు అందించేందుకు శని,సోమవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో అవతలి వైపు నుంచి కూడా సానుకూల సమాచారం రావచ్చు. ప్రతిపాదనలు అందించే సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, మంగళ, బుధవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

కన్య :   మీ మనస్సులోని భావాలను ఆది, బుధవారాలు ఇష్టమైన వారికి తెలియజేస్తే శుభదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇటువంటి ప్రతిపాదనల సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండండి.

తుల : మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఇష్టమైన వారికి అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి సానుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఈ రోజుల్లో మీరు గ్రీన్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయ దిశగా బయలుదేరండి. అయితే, శని, ఆదివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం :  మీ ప్రేమసందేశాలను ఇష్టమైన వారికి అందించేందుకు శుక్ర, శనివారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు రెడ్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే అనుకూలం. ఇక సోమ, బుధవారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది.

ధనుస్సు :  మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమ వాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

మకరం :  మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శుక్ర, బుధవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. ఇంటి నుంచి తూర్పు దిశగా బయలుదేరితే శుభదాయకం. అయితే, సోమ, మంగళవారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండడం మంచిది.

కుంభం :  మీ మన స్సులోని అభిప్రాయాలను ఇష్టపడే వారికి అందించేందుకు సోమ, మంగళవారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. మీ ప్రతిపాదనలపై అవతలి వ్యక్తులు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లోరంగు దుస్తులు ధరిస్తే మంచిది.  ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరితే శుభదాయకం. అయితే శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

మీనం : మీ ప్రేమసందేశాలను ఇష్టులకు అందించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలు అవతలి వారు ఆమోదించే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement