ప్రేమకు ఎత్తుతో పనేంటి? | world's shortest couple dating for four years | Sakshi
Sakshi News home page

ప్రేమకు ఎత్తుతో పనేంటి?

Jun 11 2016 3:38 PM | Updated on Sep 4 2017 2:15 AM

ప్రేమకు ఎత్తుతో పనేంటి?

ప్రేమకు ఎత్తుతో పనేంటి?

వాళ్లిద్దరి ఎత్తు కూడా మూడు అడుగుల కంటే తక్కువే. కానీ.. ఇద్దరూ ఘాటుగా ప్రేమలో మునిగిపోయారు. అవును.. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అత్యంత పొట్టి ప్రేమజంటగా పేరొందారు.

వాళ్లిద్దరి ఎత్తు కూడా మూడు అడుగుల కంటే తక్కువే. కానీ.. ఇద్దరూ ఘాటుగా ప్రేమలో మునిగిపోయారు. అవును.. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అత్యంత పొట్టి ప్రేమజంటగా పేరొందారు. బ్రెజిల్‌కు చెందిన పౌలో గాబ్రియెల్ డా సిల్వా బారోస్ ఎత్తు 34.8 అంగుళాలు కాగా, అతడి ప్రియురాలు కట్యూషియా హొషినో ఎత్తు 35.2 అంగుళాలు. వీళ్లిద్దరూ పదేళ్ల క్రితం ఎంఎస్ఎన్ మెసెంజర్ చాటింగ్‌లో కలిశారు. తాను ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డానని పౌలో చెబుతున్నాడు. తాను చూసినప్పుడు ఆమె చాలా అందంగా కనిపించిదన్నాడు. కానీ మొదట్లో ఆమె మాత్రం అంతగా స్పందించలేదు. పైగా, సోషల్ మీడియాలో అతడిని బ్లాక్ చేసింది కూడా. మొదట్లో అతడంటే విసుగుపుట్టేదని ఆమె చెప్పింది. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత ఆమె అతడిని మళ్లీ అన్‌బ్లాక్ చేసింది.

అనుకోకుండా తాను కూడా అతడిని ఆరాధించడం మొదలుపెట్టానని ప్రస్తుతం బ్యూటీ సెలూన్ నడుపుతున్న కట్యూషియా సిగ్గుపడుతూ చెప్పింది. ఆమె అన్‌బ్లాక్ చేయగానే, ఒక్క నిమిషంలోనే అతడు హలో చెప్పాడు. రెండు నెలలు అలా మాట్లాడుకున్నాక పౌలో 186 మైళ్లు ప్రయాణించి కట్యూషియా ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. ఆమె అందం చూసి పడిపోయానని, కానీ ఆమె మాత్రం తన డ్రస్ సెన్స్ బాగోలేదని చెప్పిందని అన్నాడు.

అతడు ఆరంజ్ షర్టు, జీన్సు ధరించి సన్‌గ్లాసెస్ పెట్టుకుని వచ్చాడని, అప్పటి నుంచి ఇప్పటికి ఎలాగో కష్టపడి బాగుపడ్డాడని ఆమె చెప్పింది. గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నారు. పౌలో తన మొట్టమొదటి బోయ్‌ఫ్రెండు అని, అతడే తన సర్వస్వమని కట్యూషియా చెబుతోంది. తాము కూడా అందరు జంటల్లాగే ఉంటామని, తమ కోసం ప్రత్యేకంగా ఒక కారు డిజైన్ చేయించుకున్నామని తెలిపింది. ఇక ఆమె నడిపే బ్యూటీ సెలూన్‌లో కూడా కుర్చీలతో సహా అన్నీ ఆమె ఎత్తుకు తగినట్లుగానే ఉంటాయి. తన సొంత ఊరైన ఇటాపెవాకు మేయర్‌ పదవికి పోటీ చేయాలని పౌలో భావిస్తున్నాడు. అందరు భార్యాభర్తల్లాగే తమ మధ్య కూడా గొడవలు జరుగుతాయని, అసలు కొట్టుకోనివాళ్లు సాధారణ జంట కానే కాదని కట్యూషియా చెప్పింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement