అమెరికాలో ప్రేమికుల రోజు రికార్డు | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రేమికుల రోజు రికార్డు

Published Thu, Feb 11 2016 5:42 PM

అమెరికాలో ప్రేమికుల రోజు రికార్డు - Sakshi

న్యూయార్క్: ఈసారి ప్రేమికుల రోజు అమెరికాలో భారీ రికార్డు సృష్టించనుంది. తమ మనసుకు నచ్చినవారికోసం అక్కడి ప్రేమికులు కొనుగోళ్ల రూపంలోప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నారు. మునుపెన్నడూ చేయనంత గొప్పగా తమ ప్రేమికుల కోసం ఈ ఏడాది ప్రేమికుల రోజున వారి ప్రేమను వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసి వాటిని బహుకరించడం ద్వారా తమ ప్రేమను తెలుపుకోవాలనుకుంటున్నారు.

దీనికి సంబంధించి నేషనల్ రిటెయిల్ ఫెడరేషన్ అనే సంస్థ అంచనా ప్రకారం ఈ ఏడాది అమెరికన్లు మొత్తం 19.7 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. ఇక, ఫోర్బ్స్ విశ్లేషణ ప్రకారం ఇది 17.55 బిలియన్ డాలర్లు ఉండొచ్చని చెప్పింది. కాగా, ఈసారి సాయం వేళలో తమ ప్రియులను, ప్రియురాళ్లను కలిసి వారు ఊహించని బహుమతులు ఇచ్చేందుకే అమెరికన్లు ఇష్టపడుతున్నారని కూడా సర్వే తెలిపింది. అమెరికా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఆరోజు ఇచ్చే బహుమతులు ఇవే..
చాక్లెట్లు
పూలు
నగలు, ఆభరణాలు
గ్రీటింగ్ కార్డులు
సాయంత్రం బయటకు తీసుకెళ్లడం
కొత్త దుస్తులు
గిఫ్ట్ కార్డులు/సర్టిఫికెట్లు

Advertisement
Advertisement