ఓ ప్రధాని తల్లి ఆవేదన... | Overworked Greek PM Tsipras 'doesn't eat or sleep', says mother | Sakshi
Sakshi News home page

ఓ ప్రధాని తల్లి ఆవేదన...

Jul 18 2015 6:30 PM | Updated on Sep 3 2017 5:45 AM

ఓ ప్రధాని తల్లి ఆవేదన...

ఓ ప్రధాని తల్లి ఆవేదన...

కొడుకు రాజైనా.. బంట్రోతైనా తల్లి మనసుకు తేడాలేదు. పంచే ప్రేమకు అవధిలేదు. ఇక బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడైతే ఆ తల్లి వ్యధ అనంతం.

కొడుకు రాజైనా.. బంట్రోతైనా తల్లి మనసుకు తేడాలేదు. పంచే ప్రేమకు అవధిలేదు. ఇక బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడైతే ఆ తల్లి వ్యధ అనంతం. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తన దేశాన్ని ఓ తీరానికి చేర్చేందుకు కంటిమీద కునుకులేకుండా ప్రయత్నిస్తోన్న గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సైప్రస్ తల్లిది కూడా అలాంటి బాధే. ప్రస్తుతం సైప్రస్ ఎదుర్కొంటున్న కష్టాలను తనవిగా భావిస్తూ కొడుకు బాగుండాలని కోరుకుంటున్నది.. అలిక్సిస్ సైప్రస్ మాతృమూర్తి అరిస్ట్రి సైప్రస్.

శనివారం ఏథెన్స్ లోని  ఓ స్థానిక పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అలెక్సిస్ ఒత్తిడిలో ఉండటం తనను బాధిస్తున్నదని చెప్పారు. 'కొద్ది రోజులుగా నాకు నిద్ర పట్టడంలేదు. ఎప్పుడూ నా కొడుకు గురించిన ఆలోచనలే. దేశ భారాన్నంతా తానొక్కడే మోస్తున్నాడనిపిస్తుంటుంది. నిజానికి వాడు నా దగ్గరకొచ్చి సేదతీరాలని కోరుకుంటాను.  కానీ ప్రధానిగా ప్రతిక్షణం బిజీగా ఉండటంవల్ల సైప్రస్కు ఆ అవకాశం రావడంలేదు.

కనీసం తన పిల్లల్ని కలుసుకునే తీరిక కూడా లేకుండాపోయింది వాడికి. పని ఒత్తిడిలో సరిగా తినట్లేదు. నిద్ర కూడా పోవట్లేదు. ఏం చేస్తాం.. ప్రస్తుతం అలెక్సిస్కి వేరే దారి లేదనేది స్పష్టం' అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చిన గ్రీస్ ప్రధాని తల్లి. చిన్నవయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్న తన కొడుకు.. భవిష్యత్ లో గ్రీస్ ను ఉన్నతంగా నిలబెడతాడనే నమ్మకం ఉందని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement