4 కోట్లకు పైగా వీక్షించిన సంచలన వీడియో | Mum in Chewbacca mask shatters Facebook Live record | Sakshi
Sakshi News home page

4 కోట్లకు పైగా వీక్షించిన సంచలన వీడియో

May 21 2016 4:25 PM | Updated on Jul 26 2018 12:59 PM

4 కోట్లకు పైగా  వీక్షించిన సంచలన వీడియో - Sakshi

4 కోట్లకు పైగా వీక్షించిన సంచలన వీడియో

అలవాటులో భాగంగా ఓ మహిళ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది.

వాషింగ్టన్ : అలవాటులో భాగంగా  ఓ మహిళ  ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి  ఇపుడు వైరల్ అయింది. డాలస్  కు  చెందిన క్యాన్ డేస్ పైన్ (37)తన పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు ఏదైనా  బహుమతి కొందామని షాపు కెళ్లి ఆసక్తి ఉండడంతో ఒక  సో బక్కా మాస్క్ ( చింపాంజీ లాంటి)ను కొనుగోలు చేసింది.  ఇంటికి వస్తూ.. కారులో దాని ధరించి ఒక నిమిషం వీడియో తీసి దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  అంతే అది క్షణాల్లో హల్ చల్ గా మారింది.   అత్యధికమంది వీక్షించిన రికార్డును సొంతం చేసింది. 4  కోట్ల 80 లక్షలమంది ని ఈ ఫన్నీ వీడియోను  చూశారు.
దీంతో పైన్  ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. పోస్ట్ చేసిన కొద్దినిమిషాల్లోనే విపరీతమైన కామెంట్లతో తన ఇన్ బాక్స నిండిపోయిందని పైన్ తెలిపింది.  లెక్కలేనన్ని ఈ మెయిల్స్ రిసీవ్  చేసుకున్నానంది.  ఈ వీడియో చూడం ద్వారా తమ డిప్రెషన్ మాయమైందని,చాలా రోజులు తర్వాత హాయి నవ్వుకున్నామని   చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది.  అయితే  స్థానిక చర్చ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పైన్ ఇలాంటి వీడియోలను ఇక ముందు కూడా పోస్ట్ చేసిందట. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు.
 కాగా ఇటీవల   ఫేస్ బుక్ లో పోస్ట్ అయిన వాటర్ మిలన్ బ్లాస్ట్ వీడియోని కోటి మందికి పైగా చూసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత రికార్డు పైన్ దే నట  



 

Advertisement
 
Advertisement
Advertisement