‘అధ్యక్ష’ బరిలోకి పోర్న్‌స్టార్‌ | Sakshi
Sakshi News home page

‘అధ్యక్ష’ బరిలోకి పోర్న్‌స్టార్‌

Published Sat, Nov 4 2017 10:58 AM

Ex porn star to stand against Putin in Russian elections - Sakshi

మాస్కో : రష్యా అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనున్నట్లు రష్యన్‌ పోర్న్‌స్టార్‌ ఎలెనా బెర్కొవా ప్రకటించారు. ఇందుకు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ను ఆమె వేదికగా ఎంచుకున్నారు. రష్యాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రష్యా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఆమె పోటీ చేయనున్నారు.

నైరుతి రష్యాలోని ముర్‌మన్‌స్క్‌ ఎలెనా సొంత పట్టణం. తాను అధ్యక్ష పదవి చేపడితే ‘సెక్సువల్‌ హరాస్‌మెంట్‌’కు ఉరి శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని ఎలెనా పేర్కొన్నారు. హార్వీ విన్‌స్టన్‌ లాంటి వాళ్లను చూసిన తర్వాత తాను ఉరి శిక్షను విధించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న స్కర్ట్‌లపై నిషేధం విధిస్తానని కూడా ఆమె చెప్పారు.

విడాకులు తీసుకోవడం అసాధ్యమయ్యేలా నిబంధనలు సడలిస్తానని, పాఠశాలల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. అధ్యక్ష పదవి ప్రచారంలో మహిళలు విరివిగా పాల్గొంటున్నారని, అందుకే తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement