SHOCKING: Total Positive Cases in China, Unofficially Reports | కరోనాపై చైనా లెక్కలు బట్టబయలు..! - Sakshi Telugu
Sakshi News home page

చైనాలో ఆరు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు!

Published Mon, May 18 2020 12:01 PM

coronavirus cases In China  may be 8 times more than - Sakshi

వాషింగ్టన్‌ : కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో పొరుగుదేశం చైనా తప్పుడు లెక్కలు బట్టబయలు అయ్యాయి. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. డ్రాగన్‌ దేశంలో ఇప్పటి వరకే 6లక్షల 40 వేలకుపైగా కోవిడ్‌ కేసులు వెలుగుచూసి ఉంటాయని బహిర్గతం చేసింది. ఈ మేరకు చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఓ నివేదిక లీక్‌ అ‍యినట్లు వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ అండ్‌ 100 రిపోర్టర్స్‌' ఓ వార్తను ప్రచురించింది. దేశం వ్యాప్తంగా గల రెస్టారెంట్‌లు, సూపర్‌ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రిల్లో నమోదైన కేసులకు గల వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు పేర్కొంది. అలాగే మొత్తం 230 నగరాల్లో నమోదైన రికార్డలును పరిశీలించిన నివేదికను తయారు చేసినట్లు స్పష్టం చేసింది. (కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే)

కాగా ప్రస్తుతం చైనా చెబుతున్న గణాంకాల ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కరోనా పాజిటివ్‌ నమోదు అయ్యాయి. అయితే చైనా తప్పుడు లెక్కలు చెబుతోందంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా గణాంకాలను బహిర్గతం చూస్తూ నివేదిక బయటపడింది. దీంతో నిజంగానే చైనా తప్పుడు లెక్కలను చెబుతుందంటూ  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోవిడ్‌​-19 పుట్టుక, వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా, యూరోపియన్‌ యూనియన్ తీర్మానం చేశాయి. దీనికి భారత్‌తో పాటు మరో 62 దేశాలు మద్దతు ప్రకటించాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశాల్లో దీనిపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. (స్వతంత్ర దర్యాప్తు: భారత్‌ సహా 62 దేశాల మద్దతు!)

ఇక కరోనా వైరస్‌  నుంచి ఇప్పడే కోలుకుంటున్న చైనాలో రాబోయే రోజుల్లో మరోసారి విజృంభించే అవకాశం ఉందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో గడిచిన వారంరోజులుగా  కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదు కావడం తీవ్ర  ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement