భారీ వర్షాలు..18 మంది మృతి | 18 killed in China floods | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు..18 మంది మృతి

Jul 17 2017 11:17 AM | Updated on Sep 5 2017 4:15 PM

చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు 18 మంది మృతి చెందారు.

బీజింగ్‌: చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు 18 మంది మృతి చెందగా కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చైనాలోని జిలిన్‌ సిటీని వరదలు పూర్తిగా ముంచెత్తాయని, సుమారు 110,000 ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
 
రెస్క్యూటీం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని, వరదల్లో కొట్టుకు వచ్చిన బురద, శిథిలాలను తీసేస్తున్నాయన్నారు. బ్రిడ్జీల మరమ్మతులు జరుగుతున్నాయని మొబైల్‌, కరెంట్‌ కనెక్షన్లు పునరుధ్దిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement