శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడి హల్‌చల్ | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడి హల్‌చల్

Published Wed, Oct 7 2015 11:46 AM

youth drunk and created nusense at shamshabad airport

శంషాబాద్(రంగారెడ్డి): యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమానంలో వచ్చిన ఓ యువకుడు బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందిని కాసేపు హడలెత్తించాడు. కేవలం అరబ్ భాష మాత్రమే మాట్లాడుతున్న యువకుడు తన వింత మాటలు, చేష్టలతో అధికారులను విసిగిస్తున్నాడు.

దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు అరబ్ తెలిసిన దుబాసిలతో అతని గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ యువకుడు మద్యం సేవించి ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement