► కొత్తగూడెంలో ఏకంగా 49 డిగ్రీలు
► ఓపెన్ కాస్ట్ వద్ద 52 డిగ్రీలకు చేరిక!
► ఇప్పుడే మే స్థాయిలో మంటెత్తుతున్న ఎండలు
► మణుగూరు, నిజామాబాద్, రామగుండం, మెదక్ల్లోనూ అగ్ని వర్షం
► మరో రెండు రోజులూ రాష్ట్రం నిప్పుల కొలిమే
► ప్రజలు ఎండలో తిరగొద్దని కలెక్టర్ల హెచ్చరికలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇప్పటికే చండప్రచండంగా చెలరేగుతూ చుక్కలు చూపుతున్న భానుడు గురువారం మరింత మండిపోయాడు. దాంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గురువారం రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది! అక్కడికి చేరువలోని ఓపెన్ కాస్ట్ గనుల వద్దయితే ఏకంగా 52 డిగ్రీలకు చేరుకుందని అనధికార లెక్కలు చెబుతున్నాయి!! దాంతో ఆ ప్రాంతమంతా అక్షరాలా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. కొత్తగూడెంలో బుధవారమే 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం తెలిసిందే. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేలా ఉండటంతో కొత్తగూడెంలో 50 డిగ్రీలు నమోదవడం ఖాయమంటున్నారు.
గతేడాది ఓపెన్ కాస్టు గనుల వద్ద మే నెలలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఏప్రిల్ రెండో వారంలోనే ఇంతటి ఎండలుంటే, ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మణుగూరులో 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.6, మెదక్ పట్టణంలో 43.4, రామగుండంలో 43.3 , జగిత్యాలలో 43, కరీంనగర్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు తోడు వడగాడ్పులు కూడా తీవ్రంగా ఉండటంతో పగటివేళ వెలుపలికి రావాలంటేనే జనం జంకుతున్నారు.
చెట్ల నీడన కూర్చున్నా వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కూడా తెలంగాణలో పలుచోట్ల 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలుల ప్రభావమూ తీవ్రంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 మధ్య బయటకు రావద్దని పలు జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌కు కాస్త ఊరట...
సముద్ర గాలుల ప్రభావంతో ఏర్పడ్డ తేమతో కొన్ని చోట్ల వాతావరణం మేఘావృతం కావడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండ తీవ్రత గురువారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో బుధవారం 43 డిగ్రీలు నమోదవగా గురువారం 41.5కు తగ్గింది. గత మూడు రోజులతో పోలిస్తే వాతావరణం కొంత చల్లబడటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. మణుగూరు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి తదితర చోట్ల సాయంత్రం చినుకులు పడి చల్లబడింది. కానీ ఎండ తగ్గినా ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. వచ్చే రెండు రోజుల్లో చినుకులు కురిసే అవకాశం లేనందున మళ్లీ భానుడు నిప్పులు చెరిగే అవకాశం ఉంది.
భానుడి భుగభుగలు
Published Fri, Apr 15 2016 2:39 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement