పార్క్ చేసిన బైక్ చోరీ.. . | Theft of the parked bike . | Sakshi
Sakshi News home page

పార్క్ చేసిన బైక్ చోరీ.. .

Dec 16 2015 8:35 PM | Updated on Aug 13 2018 3:53 PM

చైనా బజార్ ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం అదశ్యమైన సంఘటన బుధవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

చైనా బజార్ ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం అదశ్యమైన సంఘటన బుధవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన హోంగార్డు హరిబాబు బుధవారం షాపింగ్ నిమిత్తం తన హిరో హోండా ద్విచక్ర వాహ నం (ఏపీ 29బీసీ1952)పై పిసల్‌బండ చౌరస్తాకు వచ్చాడు. కాగా పిసల్‌బండ చౌరస్తాలోని చైనా బజార్ షాపు ముందు తన వాహనాన్ని పార్కు లోనికి వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి పార్కు చేసిన తన ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో హరిబాబు స్థానిక ప్రాంతాల్లో వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీనిపై బాధితుడు హరిబాబు సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement