డా. జీవీ రావుకు బీసీ రాయ్ అవార్డు | gv rao get b c roy award | Sakshi
Sakshi News home page

డా. జీవీ రావుకు బీసీ రాయ్ అవార్డు

May 29 2016 2:24 AM | Updated on Sep 4 2017 1:08 AM

ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్యులుగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ శస్త్ర చికిత్సల నిపుణులు డా. జీవీ రావుకు ప్రతిష్టాత్మక డా. బీసీ రాయ్ అవార్డు దక్కింది.

సాక్షి, హైదరాబాద్: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్యులుగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ శస్త్ర చికిత్సల నిపుణులు డా. జీవీ రావుకు ప్రతిష్టాత్మక డా. బీసీ రాయ్ అవార్డు దక్కింది. డా. బీసీ రాయ్ పేరు మీద భారతీయ వైద్య మండలి ప్రతిఏటా ప్రతిష్టాత్మక అవార్డులు ఇస్తుంది. ఈ సంవత్సరం డా. జీవీ రావుకు ప్రకటించారు. ఈయన అతి తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్‌వాసివ్ సర్జరీ) శస్త్ర చికిత్సలు చేయడంలో నిపుణులుగా పేరుగాంచారు. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా జీవీ రావుకు ఈ అవార్డును అందజేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement