ఎంసెట్ మెడికల్కి ఎస్ కోడ్ ప్రశ్నపత్రం ఎంపిక | EAMCET Medical : s code paper selected by health minister | Sakshi
Sakshi News home page

ఎంసెట్ మెడికల్కి ఎస్ కోడ్ ప్రశ్నపత్రం ఎంపిక

May 15 2016 10:46 AM | Updated on Sep 4 2017 12:10 AM

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న వైద్యవిద్య, వ్యవసాయ పరీక్ష (ఎంసెట్ మెడికల్) కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఎస్ కోడ్ ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న వైద్యవిద్య, వ్యవసాయ పరీక్ష (ఎంసెట్ మెడికల్) కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఎస్ కోడ్ ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. ఈ పరీక్షకు 1,01,005 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుంది.

ఈ సందర్బంగా మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈసారి నీట్ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. అయితే విద్యార్థులు అనుభవం కోసం ఎంసెట్ పరీక్ష రాయవచ్చు అని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement