కారును ఢీకొట్టడమే కాకుండా దౌర్జన్యం | driver rash driveing in hyderabad | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టడమే కాకుండా దౌర్జన్యం

Jul 12 2016 6:47 PM | Updated on Sep 4 2017 4:42 AM

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ఆయన కుమార్తెతోపాటు భార్యపై మరో కారు డ్రైవర్ దుర్భాషలాడాడు.

హైదరాబాద్ : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ఆయన కుమార్తెతోపాటు భార్యపై మరో కారు డ్రైవర్ దుర్భాషలాడాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ కుమార్తె  ఫియోనా మెక్ అలిస్టర్ తన తల్లితో కలిసి సోమవారం రాత్రి షేక్‌పేట్ నాలా వైపు నుంచి కారులో అపర్ణ సినార్ వ్యాలీ వైపు వస్తుంది.

ఆ క్రమంలో ఏపీ 29 ఏఎల్ 9332 కారు .. ఈ కారును ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టింది. ఇదేమిటని కారు నడుపుతున్న డ్రైవర్‌తో పాటు అందులో కూర్చున్న ఫియోనా.. ఢీకొట్టిన కారు డ్రైవర్ను ప్రశ్నించింది. దీంతో రెచ్చిపోయిన కారు డ్రై వర్ వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ... కారు అద్దాలు పగలగొట్టేందుకు యత్నించాడు.

కారులోని మహిళలపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమాదానికి కారకుడైన కారు యజమానిపై ఐపీసీ సెక్షన్ 279, 341, 506ల కింద కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసును ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement