చాందిని కేసును ఛేదించిన పోలీసులు

చాందిని కేసును ఛేదించిన పోలీసులు


సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌ కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ (17)  దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్‌ను ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నగర పోలీసులు సాయికిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.


మదీనాగూడలోని అపార్ట్‌మెంట్లో నివాసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన చాందిని సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపించింది. సాయికిరణే ఆమెను ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి చాందిని స్నేహితులను, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా సాయికిరణే ఈ హత్యకు సూత్రధారి అని తేలింది.

Back to Top