Sakshi News home page

సినిమా కష్టాలు

Published Sun, Jan 25 2015 1:10 AM

సినిమా కష్టాలు - Sakshi

ఈ థియేటర్ ప్రొజెక్టర్ రూమ్ సూడాన్ దేశ సినిమా వైభవానికి  సాక్ష్యం. పక్కన ఉన్నది మూడు దశాబ్దాల నుంచి దీని ఆపరేటర్‌గా పనిచేస్తున్న అలీ అల్‌నూర్. ఒకప్పుడు బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు, ఈజిప్షియన్ కామెడీలకు, హాలీవుడ్ థ్రిల్లర్లకు సూడాన్‌లో ఎనలేని ఆదరణ ఉండేది. అయితే దశాబ్దాలుగా ఎడతెగని ఆర్థిక మాంద్యం, ఇస్లామిక్ నియంతృత్వ ప్రభుత్వ ధోరణిలతో సినిమా హాళ్లకు కష్టాలొచ్చాయి.

సినిమాల డబ్బింగ్ పూర్తిగా ఆగిపోయింది. 46 లక్షల జనాభా ఉన్న తమ నగరంలో ఇప్పుడు మూడే హాళ్లున్నాయని వాటిల్లో పాత సినిమాలు అడించినా టికెట్ కొని థియేటర్‌లోకి అడుగుపెట్టే శక్తి మాత్రం తక్కువమందికే ఉందని అలీ చెబుతారు.

Advertisement
Advertisement