బూమ్ బూమ్... భలే గేమ్! | Lakshmi Manchu's Boom Boom | Sakshi
Sakshi News home page

బూమ్ బూమ్... భలే గేమ్!

Feb 7 2016 1:08 AM | Updated on Sep 3 2017 5:04 PM

బూమ్ బూమ్... భలే గేమ్!

బూమ్ బూమ్... భలే గేమ్!

ఏ షో అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ప్రేక్షకులకి నచ్చే ఎలిమెంట్లు ఉన్నప్పుడు.

 ఏ షో అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ప్రేక్షకులకి నచ్చే ఎలిమెంట్లు ఉన్నప్పుడు. అయితే ఎలిమెంట్లు ఉంటే సరిపోతుందా? లేదు... షోని అందంగా, ఆసక్తికరంగా నడిపించే హోస్ట్ ఉండాలి. మాటలను వరదలా పారించాలి. మాట్లాడే ప్రతి మాటా ప్రేక్షకుడికి  నచ్చాలి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేయాలి.
 
  అలా చేయడంలో నూరుశాతం సక్సెస్ అయ్యారు మంచు లక్ష్మీప్రసన్న. ‘బూమ్ బూమ్’ అనే గేమ్‌షోని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారామె. వారానికో సెలెబ్రిటీని పిలిచి, వారిని ఆడించి, వారిచేత ఆసక్తికరమైన విషయాలు చెప్పించి, టెన్షన్ పెట్టి, సందడి చేసి... షోకి ఎన్ని రకాల ప్లస్సులు యాడ్ చేయగలరో అన్నీ చేస్తున్నారు. ‘బూమ్ బూమ్... ఇట్స్ ఎన్ ఎక్స్‌ప్లోజివ్ గేమ్ షో’ అని అనడంలోనే ఆమె స్టయిల్ అంతా కనిపిస్తోంది. షో నడిచినంతసేపూ ప్రేక్షకుడు చానెల్ మార్చడం లేదంటే ఆ ఘనత కచ్చితంగా లక్ష్మిదే. అందుకే అది ఆమె షో!
 

Advertisement
 
Advertisement
Advertisement