జంప్ జ్యుయెలరీ | Jamprings jewellery | Sakshi
Sakshi News home page

జంప్ జ్యుయెలరీ

Jun 12 2016 2:37 AM | Updated on Aug 3 2018 3:04 PM

జంప్ జ్యుయెలరీ - Sakshi

జంప్ జ్యుయెలరీ

ఒకే రకమైన జ్యుయెలరీని వేసుకోవడాన్ని ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత.

ఒకే రకమైన జ్యుయెలరీని వేసుకోవడాన్ని ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. ఏ డ్రెస్ వేసుకుంటే దానికి తగ్గ జ్యుయెలరీనే వేసుకోవడానికి ఇష్టపడుతోంది. అంతేకాదు.. ఒకేరకమైన మేకింగ్‌నూ అవాయిడ్ చేస్తున్నారు టీనేజర్స్. అందుకే భిన్నంగా కొత్తగా కనిపించే జంప్‌రింగ్స్ జ్యుయెలరీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలా అంటారా? అయితే తయారీకై ఓ లుక్కేద్దాం...
 
కావలసినవి: స్టీల్, గోల్డ్, కాపర్ కలర్ జంప్‌రింగ్స్ (చిన్నవి, పెద్దవి), రింగ్స్‌ను అడ్జస్ట్ చేయగల పట్టకారు, రంగురంగుల పూసలు (సైజు మీ ఇష్టం), హుక్ ఉన్న చెయిన్ (నెక్‌లేస్ కోసం)
 తయారీ: ముందుగా గోల్డ్ కలర్ జంప్‌రింగ్ నెక్‌లేస్ మేకింగ్ చూద్దాం.. రెండు పెద్ద సైజు రింగ్స్‌ను తీసుకొని, రెండింటినీ చిన్న రింగ్‌తో కలపాలి. అలా మీకు కావలసిన పొడవులో ఒక లైను తయారు చేసుకోవాలి.

తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు చివర్లలో ఒక్కో రింగ్‌ను వదిలేసి రెండో లైన్‌ను పూర్తిచేయాలి. అలాగే ప్రతి వరుసలో రెండు చివర్లు వదిలేసుకుంటూ... ఆఖరికి ఒక్క రింగు మాత్రమే మిగిలేలా చూసుకోవాలి. ఆ చివరి రింగుకు ఏదైనా రంగు రాయి లేదా బీడ్‌ను తగిలించాలి. ఇప్పుడు పై వరుస చివరి రింగులకు హుక్ ఉన్న చెయిన్‌ను బిగిస్తే సరి.. ఎంతో అందమైన నెక్‌లేస్ రెడీ. అలాగే ఈ జంప్‌రింగ్స్‌తో ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్, కాళ్ల పట్టీలు, ఉంగరాలను తయారు చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement