ఈ ఏడాది మొదట్లో జికా ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ‘మయారో’ అనే జబ్బు పొంచి ఉందని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు... వరసగా రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, క్రిమియన్-కాంగో హ్యామరేజిక్ ఫీవర్ వంటివి క్యూలో నిలబడి తమ వంతుకోసం వేచి చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మయారో అనేది దాదాపు చికన్‌గున్యా వ్యాధి లక్షణాలనే పోలి ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుందనీ, ఇలా చికన్గున్యాతో పోలికలు ఉన్నందున కీళ్లనొప్పులతో ఇది మానవాళిని వేధించనుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికన్’ అనే మ్యాగజైన్ వెల్లడించింది. అలాగే ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ అంచనాల ప్రకారం... ‘రిఫ్ట్ వ్యాలీ ఫీవర్’ అనేది ఇతర జంతుజాలాల్లో చాలా సాధారణంగా కనిపిస్తుందనీ, ఇలా ఇతర జంతువుల్లో కనిపించే వ్యాధులు... ఆ తర్వాత మానవాళిలో (హ్యూమన్ బీయింగ్) కనిపించాయి కాబట్టి ఇది కూడా మనుషుల్లో కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ‘క్రిమియన్-కాంగో హేమరేజిక్ ఫీవర్’ అనే వ్యాధి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతోంది. జంతుజాలం మీద ఉండే కీటకాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, ఒంటినొప్పులు, మగతగా ఉండటం, మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. డెంగ్యూలాగే అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇది వచ్చినప్పుడు చాలా అపాయకరంగా పరిణమించవచ్చని ఆందోళన చెందుతోంది డబ్ల్యూహెచ్ఓ. ‘మయారో’ లాగే ‘యుసుటు’ అనే మరో జబ్బు కూడా వచ్చే అవకాశం ఉందనీ, ఇది ‘వెస్ట్ నైల్ వైరస్’లాగే ఉంటుందని హెచ్చరిస్తోంది ‘సైంటిఫిక్ అమెరికన్’ మ్యాగజైన్. పక్షుల్లో ఇది అప్పటికే ఉంది. క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకూ వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆ సైన్స్ జర్నల్.
జికా తర్వాత మయారో...!
Published Sun, Oct 30 2016 4:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement