మీకు తెలుసా? | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా?

Published Sun, Jan 31 2016 12:45 AM

మీకు తెలుసా?

 ఈ ప్రపంచంలో ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోగలిగే జీవి పాండా ఒక్కటే. దానికి నిద్ర వచ్చిందంటే అప్పటికి ఉన్నచోట పడుకుని నిద్రపోతుంది!
 
 జపాన్‌లోని ఓ ప్రీ స్కూల్లో పిల్లలు ఆడుకోడానికి స్విమ్మింగ్‌పూల్ ఉంటుంది. అయితే ఈ పూల్ నిండా ఉండేది వర్షపు నీరు. వర్షం కురిసినప్పుడు నేరుగా దానిలో పడేలా దీన్ని నిర్మించారు. దీనివల్ల నీటి వినియోగం, వనరుల పరిరక్షణ వంటి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే అర్థమయ్యేలా చెప్పొచ్చు అంటుంది ఆ స్కూల్ యాజమాన్యం!
 
 ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ డిక్సన్ అనే యువకుడు జంతువులతో సెల్ఫీలు తీసుకోవడంలో రికార్డు సృష్టించాడు. కొన్ని వందల రకాల జంతువులతో ఇతనికి సెల్ఫీలున్నాయి. సెల్ఫీ కోసం జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఎన్ని గంటలైనా కష్టపడతాడు తప్ప వెనుదీయడు అలెన్!
 
 పోలెండ్‌లో ఇగా జెసికా అనే యువతికి డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ సగం అయ్యాక ఆ అమ్మాయికి మెలకువ వచ్చేసి, డాక్టర్లతో మాట్లాడటం మొదలు పెట్టింది. తనకు ఎటువంటి నొప్పీ తెలియడం లేదని ఆమె అనడంతో, మళ్లీ అనస్థీషియా ఇవ్వకుండానే సర్జరీ పూర్తి చేసేశారట వైద్యులు!
 
 రష్యాకు చెందిన ఓ కుటుంబం విహార యాత్రకని అడవికి వెళ్లారు. అక్కడ వారి మూడేళ్ల పాప తప్పిపోయింది. పదకొండు రోజుల పాటు వెతికాక ఓ చోట కనిపించింది. అన్ని రోజులూ ఆ పాప ఓ గుంటలోని నీళ్లు తాగుతూ, రాలి పడిన బెర్రీస్ తింటూ గడిపిందట!
 

Advertisement
Advertisement