నెగటివ్ షేడ్ | Negative Shade | Sakshi
Sakshi News home page

నెగటివ్ షేడ్

Feb 19 2015 4:28 AM | Updated on Sep 2 2017 9:32 PM

నెగటివ్ షేడ్

నెగటివ్ షేడ్

అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు బాలీవుడ్ నటుడు ఆదిత్యా పాంచోలి.

అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు బాలీవుడ్ నటుడు ఆదిత్యా పాంచోలి. పెద్దగా క్యారెక్టర్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఇతగాడి మైండ్ సెట్ కూడా అవుటాఫ్ ఆర్డర్‌లో ఉన్నట్టుంది. సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ సెట్స్‌లో మనోడు రచ్చ రచ్చ చేశాడట. షూటింగ్‌కు లేటుగా వచ్చింది కాక... కొంతమంది యూనిట్ సభ్యులతో దురుసుగా ప్రవర్తించాడట. అంతటితో ఆగకుండా మరికొందరిని పని చేయకుండా అడ్డుకున్నాడట. రావడమే బ్యాడ్ టెంపర్‌తో కనిపించిన ఆదిత్యను దర్శకుడు వెంటనే ఇంటికి పంపించేశాడట. తెల్లారి ఉదయం మళ్లీ సెట్స్‌కు వచ్చిన టెంపర్ బాయ్ చాలా కూల్‌గా ఉన్నాడనేది మిడ్ డే కథనం. అంతే కాదు... అందరికీ సారీ చెప్పి వర్క్ మొదలెట్టాడట. ఎవరి మీద కోపమో ఇంకెవరిమీదో చూపించి అభాసు పాలయిన ఆదిత్య... ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు.!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement